ఆర్సీబీ సరికొత్త రికార్డు.. చెన్నై సూపర్ కింగ్స్ ఐదేళ్ల హిస్టరీకి బ్రేక్

ఆర్సీబీ సరికొత్త రికార్డు.. చెన్నై సూపర్ కింగ్స్ ఐదేళ్ల హిస్టరీకి బ్రేక్

 IPL 2026 Final: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ నడుస్తోంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫీల్డింగ్ తీసుకుని గుజరాత్ టైటాన్స్ (GT) ను బ్యాటింగ్‌కు దించింది. ఆర్‌సీబీ బౌలర్లు మ్యాచ్ స్టార్టింగ్ నుంచే నిప్పులు చెరుగుతుండటంతో గుజరాత్ టీం కేవలం 8 ఓవర్లకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకవైపు వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి బ్యాక్-టు-బ్యాక్ ఛాంపియన్స్‌గా నిలవాలని బెంగళూరు తహతహలాడుతుంటే.. మ్యాచ్ ముగియక ముందే ఆర్‌సీబీ ఖాతాలో ఒక మైండ్ బ్లోయింగ్ రికార్డ్ చేరింది. 

సీఎస్‌కే రికార్డుకు చెక్: 
ఈ సీజన్‌లో ఆర్సీబీ అద్భుతమైన స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుంది. రజత్ పాటిదార్ సారథ్యంలోని ఈ జట్టులో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్ లాంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ, తుది జట్టులో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరమే రాలే.. సాధారణంగా గాయాలు, ప్లేయర్స్ ఫామ్ లేమి కారణంగా జట్లు ప్రయోగాలు చేస్తుంటాయి. కానీ ఆర్‌సీబీ మాత్రం తమ కోర్ టీమ్ ని నమ్ముకుని సక్సెస్ అయింది. రూ.124.75 కోట్లతో ఏకంగా 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసినప్పటికీ, బెంగళూరు కేవలం 16 మంది ప్లేయర్స్ ని మాత్రమే మైదానంలోకి దించింది. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అతి తక్కువ మంది ఆటగాళ్లను ఉపయోగించిన జట్ల అరుదైన జాబితాలో ఆర్‌సీబీ మూడో స్థానంలో నిలిచింది.  

అతి తక్కువ మంది ప్లేయర్స్ ని ఉపయోగించిన జట్లు: 
* 2015 చెన్నై సూపర్ కింగ్స్ (CSK): కేవలం 14 మంది ఆటగాళ్లతోనే సీజన్ ముగించి టాప్‌లో ఉంది.
* ముంబై ఇండియన్స్ (MI): 2018, 2020 సీజన్లలో 15 మంది ఆటగాళ్లను ఉపయోగించింది.
* ఆర్‌సీబీ (RCB): ఇప్పుడు 16 మంది ప్లేయర్స్ తో 2018 కోల్‌కతా, 2021 సీఎస్కే సరసన నిలిచిన బెంగళూరు

జట్టుకు కొండంత అండగా కింగ్ కోహ్లీ: 
ఈ సీజన్ ఆర్‌సీబీ రూ.21 కోట్లకు విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకుంది. లీగ్ దశ నుంచి ప్లేఆఫ్స్ వరకు ప్రతి మ్యాచ్ ఆడిన కింగ్ కోహ్లీ, జట్టు విజయాల్లో కీ రోల్ పోషించాడు. ప్రారంభ మ్యాచ్‌లకు జోష్ హాజిల్‌వుడ్ దూరమైనప్పటికీ, అతడు తిరిగొచ్చిన తర్వాత బౌలింగ్ దళం మరింత పటిష్టంగా మారిపోయింది. జట్టు కోర్ బలంగా ఉండటంతో బెంగళూరు యాజమాన్యానికి తరచుగా ప్లేయర్స్ ని మార్చాల్సిన అవకాశం రాలేదు. 

►ALSO READ | గుజరాత్ గడ్డపై గర్జిస్తోన్న RCB బౌలర్స్.. తొలి 10 ఓవర్లలో GT స్కోర్ ఎంతంటే..?

బెంచ్ కే పరిమితమైన స్టార్ ప్లేయర్లు: 
మరోవైపు కొందరు స్టార్ ప్లేయర్స్ స్థిరమైన ప్రదర్శనతో దూసుకుపోతుంటే, మరికొందరు మాత్రం వివిధ కారణాలతో మైదానంలోకి అడుగు పెట్టలేకపోయారు. శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి పర్మిషన్ దొరక్కపోవడంతో నువాన్ తుషార, వ్యక్తిగత వివాదాలు, చట్టపరమైన సమస్యలతో యశ్ దయాల్ ఐపీఎల్ కి దూరమయ్యారు. వీరితో పాటు స్వప్నిల్ సింగ్, విక్కీ ఓస్త్వాల్, జోర్డాన్ కాక్స్ లాంటి దాదాపు 9 మంది ప్లేయర్స్ కి ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ ఆడే ఛాన్స్ రాలేదు.. అయినప్పటికీ బెంగళూరు జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. 

కప్పు గెలిచేది ఆ జట్టే:  
లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో 9 విజయాలు నమోదు చేసి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆర్సీబీ క్వాలిఫైయర్-1 లోనూ గుజరాత్‌ను చిత్తుగా ఓడించింది. ఇప్పుడు అహ్మదాబాద్ స్టేడియంలో ఫైనల్ పోరులోనూ గుజరాత్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. 99 పరుగులకే 5 వికెట్లన నష్టపోయిన గుజరాత్ తీవ్ర కష్టాల్లో కురుకుపోయింది. అటు అరుదైన రికార్డు, ఇటు వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచే అవకాశం ఆర్సీబీకి రావడంతో.. బెంగళూరు ఫ్యాన్స్ గుండెల్లో సరికొత్త ఆశలు రేకెత్తుతున్నాయి.